¡Sorpréndeme!

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 Reason Why | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్ | ABP Desam

2025-04-21 0 Dailymotion

  నిన్న పంజాబ్ మీద జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించిన ఆర్సీబీ తరపున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికైంది కింగ్ విరాట్ కొహ్లీ. రాత్రి ముంబైకి చెన్నైకి జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నది రోహిత్ శర్మ. పంజాబ్ మీద మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి ఆట చివరి బంతి  వరకూ క్రీజులోనే ఉన్న విరాట్....54 బాల్స్ ఆడి 7 ఫోర్లు 1 సిక్స్ తో 73 పరుగులు చేసి ఆర్సీబీ 7వికెట్ల తేడాతో గెలిచేలా చేశాడు. అందుకే ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు కొహ్లీకి దక్కింది. మరో వైపు రాత్రి జరిగిన చెన్నై, ముంబై మ్యాచ్ లో రోహిత్ శర్మ పెను విధ్వంసమే సృష్టించాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు 6 భారీ సిక్సర్లతో సీజన్ లో తొలిసారి హాఫ్ సెంచరీ మార్క్ దాటుతూ 76 పరుగులు చేసి రోహిత్ తననెందుకు హిట్ మ్యాన్ అంటారో నిరూపించాడు. అలా ఒకే రోజు రో- కో ఇద్దరూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుంటే..చెన్నై కి నిన్న జరిగిన ముంబై మ్యాచ్ కాకుండా దానికి ముందు జరిగిన LSG మ్యాచ్ లో ధోనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వాస్తవానికి ఈ ముగ్గురూ ప్లేయర్లతో అదేస్థాయిలో ఆడిన మరొక ప్లేయర్ ఉండొచ్చు కానీ...ఐపీఎల్ కే స్టార్ వాల్యూ, బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన మూడు జట్లైన సీఎస్కే, ముంబై, ఆర్సీబీ టీమ్ కి వన్నె తెచ్చిన ప్లేయర్లుగా వీళ్లకు దక్కాల్సిన గౌరవం అది. ఈ సీజన్ లో స్టార్టింగ్ లో ముంబై, చెన్నై మ్యాచ్ లు ఓడిపోతుండటంతో సౌత్ లో ఐపీఎల్ మీద స్టేడియానికి వెళ్లి చూసే క్రేజ్ తగ్గింది. టిక్కెట్లు మిగిలిపోయాయి. అందుకే ఐపీఎల్ కి సరికొత్త ఉత్సాహం వచ్చేలా బ్రాండ్ వాల్యూ పెంచిన హీరోల హీరోయిక్స్ ను హైలెట్ చేయాలని..తద్వారా వారి ఫ్యాన్స్ ను ఆటోమెటిగ్గా క్రికెట్ ఫ్యాన్స్ ను స్టేడియాలకు వచ్చేయాలనే చేయాలనే బిజినెస్ యాంగిల్ కూడా ఇందులో ఉందనేది తెలుసుకోవాల్సిన విషయం.